ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఓ తమ్ముడి కథ

MAY 1994 - RACHANA TELUGU MAGAZINE

" ఏం బాబూ నువ్వు దిగవలసినది కొవ్వురేనా? " 
ఆలోచనల్లో ఉన్న కిట్టూ జవాబివ్వలేదు . "ఏవయ్యోవ్ నిన్నే" - అతన్ని కదిపింది ముసలావిడ . అప్పుడు తెలివి తెచ్చుకుని ఏమిటన్నట్టు చూసాడు కిట్టూ . 
"నువ్వు కొవ్వూరులో దిగాలన్నావా లేదా? " 
"అవునండి"
"మరి కొవ్వూర్లో రైలాగి ఇంతసేపయింది . ఎమాలోచిన్స్తున్నావ్ ?"
"ఆ! కొవ్వురోచ్చేసిండా?" అంటూ గబగబా రైలు దిగాడు కిట్టూ . 
"ఇదిగో నీ సంచీ మరిచిపోయావు ." అని అందించిన్దావిడ కిటికీలోంచి . కిట్టూ సంచీ తీసుకుని ముందుకి నడవబోతూ రైలు పెట్టేలన్నింట్లో తొంగి చూస్తూ వస్తున్న సూర్యాన్ని చూసాడు . 

వెంటనే "నమస్కారం బావగారూ" అన్నాడు . 

కిట్టూ కోసం వెతుకుతూ దిక్కులు చూస్తున్న సూర్యం కిట్టూని చూడగానే, "అమ్మయ్య వచ్చేసావా! మొదటిసారి నువ్వొక్కడివే రైల్లో వస్తున్నావని నీ అక్క తెగ కంగారు పెట్టేసింది . ప్రయాణం బాగా జరిగిందా? తిండి సరిగా తిన్నావా?" అన్నాడు . 

తలాడించాడు కిట్టూ 
"పద మనిల్లు స్టేషన్ దగ్గిరే . హాయిగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్దాం" అన్నాడు సూర్యం . 
బెరుకుగా బావగారితో నడిచాడు . సూర్యంతో అట్టే చనువు లేదతనికి . "అక్క వస్తే బాగుండేది" అనుకున్నాడు . 
నిజానికి తను మామూలుగా ఉండాలని ప్రయత్నిస్తునాడు గాని అక్కని కలుసుకోబోతున్నందుకు మనసంతా ఆనందంతో గెంతులు వేస్తోంది . అక్కంటే తనకి ప్రాణం . తానంటే అక్కకి అంతే . ఇద్దరూ చిన్నప్పట్నించే ఒకరిని విడిచి ఒఅక్రు ఉండే వారే కాదు . అతనికి ఊహ తెలిసాక మొదటి నేస్తం అక్కే ! తన చిన్నప్పుడు ఇంటినిండా బాబయిలూ, అత్తలూ, ఇంకా బంధువులతో హడావుడిగా ఉండి అమ్మకి తనని చూసుకోవటానికి తీరిక ఉండేదే కాదు . తమ్ముడు పుట్టకయితే ఒక్కొక్కపుడు అమ్మకి తనని చూడకుండానే రోజు గడిచిపోయేది . కిట్టూ ఎం తిన్నాడో, ఎలా ఉన్నాడో చూసే ఓపిక, సమయం ఎవరికీ లేదు . వాడు చీమిడి ముక్కుతో మట్టి కొట్టుకుపోయిన బట్టలతో, చింపిరి జుట్టుతో ఒక్కడే ఎక్కడో ఇసకలో కూర్చుని ఆడుకుంటూ ఉండే వాదు. అప్పుడే అక్క తనని ఎత్తుకుంది . తన చీమిడి ముక్కు తుడిచింది . చింపిరి జుట్టు నున్నగా దువ్వింది . ఉతికిన బట్టలు తొడిగించి తనని రబ్బరు బొమ్మలా చేసింది . 
తను అలా బైటికి రాగానే బాబాయిలు అత్తలూ తన చుట్టూ చేరిపోయి 'ఎవరమ్మా ఈ అందాల బాబు? చెప్పమ్మా?" అన్నారు . వెంటనే కిట్టూ గొప్పగా 'మా లక్క తల దువ్వింది మా లక్క తల దువ్వింది " అన్నాడు . అందరూ ఘొల్లున నవ్వారు . "బావున్నారర్రా ! నువ్వు  నీ అక్కానూ" అంటూ . తర్వాతనుంచి తనకి కోపం వచ్చినా, బాధ కలిగినా 'లక్కా!" అంటూ కేక పెట్టేసేవాడు . ఎక్కడున్నా తన "లక్క" పరుగెత్తుకుని వచ్చేసేది . 
అక్క తన నేస్తాలతో కిట్టూని  ఆడించటానికి మొదటిసారి తీసుకేల్లినపుడు కూడా పిల్లలు చుట్టూ మూగిపోయారు . తన చేతిలో వెదురు ముక్కని చూసి "ఇదేమిటమ్మా?" అని అన్నారు .
"ఇదా ఇది పిట్టల్ ' అన్నాడు  తను గంభీరంగా .
అందరూ నవ్వేసారు . ఎందుకో తెలియకపోయినా తను కూడా నవ్వేసాడు . తరవాతనుంచి ప్రతిరోజూ వాళ్ళు ఆ ప్రశ్న అడిగి తన చేత పిట్టల్  అని చెప్పించుకునేవారు . ఆ 'పిట్టల్ ' ని చూపించి 'టిష్యూం ' అంటే ఎవేరైనా కింద పడిపోవలసిందే ! ఎన్నిసార్లు తను 'టిష్యూం ' అన్నా వాళ్ళు ఓపిగ్గా కింద పడిపోఎవాళ్ళు . అదంతా అక్క వల్లనే .
ఇద్దరూ కలసి ఇంటా , బయటా ఆడుతూనే ఉండేవారు . ఆటలన్నింట్లో అక్కడే పై చేయి . అక్క ఆడుతుంటే తను గుడ్లప్పగించి  చూస్తూ ఉండేవాడు . అందరితోనూ సమానంగానే ఆడినా అవుటయ్యేవాడు కాదు . పొలాల్లో, కాలవగాట్లలో, తోటల్లో ఎక్కడ పడితే అక్కడ వీళ్ళే ఉండేవారు .
అలా తనూ అక్కా ఆడుతూ పడుతూ గడుపుతూంటే ఓ రోజు అక్కని అడుకోనివ్వకుండా ఇంట్లో ఉన్చేసింది అమ్మ. తను ఆదుకుని వచ్చేటప్పటికి ఇద్దరు ముసలోళ్ళు, ఆడ, మగా, మరో ఇద్దరు మావయ్య వయసు వాళ్ళు వచ్చి హలో కూర్చున్నారు . వారిలోనే సూర్యం బావ కూడా ఉన్నాడు . తను గమనించలేదు గాని అక్క వీళ్ళు వచ్చేటప్పటికి చీరా, నగలోఒ వేసుకుని ముస్తాబయి ఉంది . తనని లోపలికి పొమ్మని తరిమేశారు . తర్వాత ' ఏమిటో జరిగింది . ఆ ముసలయినా , ముసలావిడా, సూర్యం బావా ఎందరూ ఎవెనో ప్రశ్నలు వేసారు . అంతా ఏవిటో మాట్లాడుకున్నారు . ఇంకాసేపటికి  అమ్మ కళ్ళు చుడుకుంటూ దేవుడి గదిలోకొచ్చి దండం పెట్టేసుకుంది .
"ఎం జరిగిందే? నాకుచెప్పవే " అని అమ్మని అడుగుతుంటే "నువ్వుండరా బాబూ! కాళ్ళకీ వేళ్లకీ అడ్డం పడుతూనూ . మీ అక్కకి పెళ్లి వచ్చే నెలలో " అనేసి హడావుడిగా వెళ్ళిపోయింది . తను ఊళ్లోకి పరుగెత్తుకు పోయాడు అందరికీ చెప్పటానికి . అప్పటికి తనకేం తెలుసు? అక్కలంతా పెళ్ళయ్యాక వేరే ఇళ్ళకి పోతారని?
అక్క పెళ్ళిలో తను హడావుడిగా తిరిగాడు . తనకి మంచి లాల్చి, పైజమా కొన్నారు . కాని ఆ తర్వాత నుంచి అక్క సరిగా కనిపించలేనే లేదు . ఎక్కడుందో ఏం చేస్తోందో కూడా తెలిసేది కాదు . చివరికి ఓ రోజు ఎప్పుడూ లేంది 'పామ్ పామ్ ' అంటూ నల్ల కారు ఇంటికి వచ్చేసింది . కారంతా పూలదండలతో ముస్తాబు చేసారు .
అక్కా, బావా కుడా దండలు వేసుకుని అందులో ఎక్కారు . అప్పుడు ఏదో అనుమానం వచ్చింది ఏదో జరుగుతోందని . తను కూడా ఎక్కుతానని గోల చేసాడు . కాని అందరూ బలవంతంగా ఆపేశారు . ఉక్రోషంతో గింజుకుంటూ, కేకలు పెడుతూ గట్టిగా ఏడ్చాడు . అయినా వాడి మాటఎవరూ వినలేదు . పదిమంది వాడి కాళ్ళూ చేతులూ పట్టుకుని ఈడ్చేస్తుంటే కారు కదిలింది . కారు వెళ్లిపోతుంటే వాడిని ఆపటం  ఎవరి తరమూ కాలెదు.  అంతా ఒకటైపోయి    తనకన్యాయం  చేసినట్టూ తను ఒక్కడే అయిపోయినట్టూ   అనిపిస్తూంటే హృదయవిదారకంగా ఏడ్చాడు . కాని అక్క హాయిగా కార్లో వెళ్ళిపోయింది .
 అక్క కోసం బెంగతో  తిండి సరిగా తినలేదు . అక్క తనని వదిలి కారులో వెళ్ళిపోవటం గుర్తొస్తూ  ఉంటూంది .    అక్కనీ వేరు చేసారని కోపంతో రగిలిపోతూ ఉండేవాడు .
పరిక్షలయ్యేవరకూ ఉగ్గాపట్టుకుని ఉన్నవాడు అక్కని చూడటానికి కొవ్వూరు వెళ్తానని రా"
"నువ్వు ఇంకా  చిన్నవాడివి. అంత దూరం వెళ్ళలేవు" అన్నారు .
" అయినా కొత్తగా పెళ్ళయ్యిన వాళ్ళ దగ్గరికి ఈ వెధవెందుకు?" అన్నారు
కిట్టూ ఏడ్చాడు . జుట్టు పీక్కున్నాడు . బట్టలు చిమ్పుకున్నాడు . నేలమీద పది దోర్లేసాడు . అరగంటా సేపు ఇల్లంతా కిందా మీదా చేసేసాడు . దెబ్బకి వాలు కాదు కదా వాళ్ళ తాతలు కుడా దిగి వచ్చారు .
"పోనీ లేవే వీడి అక్క కూడా వీడి కోసం బెంగేట్టుకుని ఉంటుంది . ఆర్నెల్ల వరకూ ఇద్దరూ ఒకరినొకరు వదిలేవారు కాదు కదా! వెళ్ళనీ సెలవుల్లో ఇక్కడ మాత్రం ఎం చేస్తాడు?" అన్నాడు తాతయ్య అమ్మతో .
"కాని ఒక్కడూ ఎలా వెల్తాడో" అని అమ్మ అంటూంటే-
"వాడేమైనా చంటి  పిల్లాడా? వాదినింకా చిన్న  చూస్తూ నువ్వే పాడు చేస్తునావు" అని మందలించాడు నాన్న .
"కాని ఒరేయ్ ! అక్కడ పిచ్చ వేషాలు వేసి అక్కని ఇబ్బంది పెట్టకు . బుద్దిగా ఉండాలి . అసలే వంటరిగా అన్ని తనే చేసుకుంటోంది " అన్నాడాయన కిట్టూ తో .
అక్క దగ్గరకి వెళ్ళటానికి అన్నిటికీ తలూపెసాడు కిట్టూ . పొద్దుటి పాసింజెర్ బండిలోవస్తున్నాడని సుర్యానికి తంతి ఇచ్చారు . మావయ్య స్టేషన్ కి వెళ్లి కిట్టూని రైలేక్కించాడు . ఆ  విధంగా కిట్టూ అనుకున్నది  సాధించాడు.
"మనింటికి వచ్చేసామోయ్" అన్నాడు సూర్యం , ఇంటి గేటు తీస్తూ .
అక్కని చూడగానే పరుగున అక్కని చేరుకున్నాడు .  వాడిని కన్నీళ్ళతో అక్కున చేర్చుకుని " ఇంత చిక్కిపోయవేమిటి రా " అంది అక్క . కిట్టూ ఆనందంతో అక్క తనని కారులో వెళ్ళిపోయినందుకు కలిగిన కోపాన్ని మరిచిపోయాడు . అందరూ ఇంట్లోకి వెళ్ళారు .
"ఇక అక్క దగ్గరికి చేరిపోయాను . ఈరోజు నుంచి అక్కతో హాయిగా ఆడుకోవచ్చు " అనుకున్నాడు కిట్టూ . కానీ వదనుకున్నట్టు జరగలేదు .
సూర్యం ఉన్నంతసేపూ కిట్టూకి అక్క దగ్గర మాట్లాడటానికి దొరికేదే కాదు.సుర్యానికి పొద్దున్న నిద్ర లేవగానే టూత్ బ్రస్శూ పేస్టూ అక్క అందించాలి . అతను పళ్ళు తోముకుని వచ్చేసరికి వేడి వేడి కాఫీ ఇవ్వాలి . కాఫీ తాగుతూ చదవటానికి ఆ రోజు పేపర్ అందించాలి . మరో వైపు నీళ్ళు కాచి బాత్రూమ్లో ఉంచాలి . అతను స్నానం చేసి వచ్చేసరికి ఆరోజు వేసుకోవలిసిన బట్టలు ఇస్త్రీ చేసి ఇవ్వాలి . ఈలోపున ఎప్పుడు చేస్తుందో ఎలా చేస్తుందో టిఫిన్ చేసి అతను స్నానం చేసి వచ్చేసరికి టేబుల్ మీద పెట్టాలి . అతను తింటున్నపుడు కూడా 'చట్నీ కావాలా? ఇడ్లీ కావాలా' అంటూ చిన్న పిల్లాడిని అడిగినట్లు  అడగాలి . ఆయనకీ బూతు లసులు బిగించాలి, చొక్కా బొత్తం ఊడితే అక్కే కుట్టాలి . 'ఈ బావగాడికి ఏమి తెలియదా? అన్ని అక్కతో చేయించుకుంటాడు?' అనుకున్నాడు కిట్టూ .
సరే 'బావగాడు' వెళ్ళిపోయాక ఏమిన ఖాళీ ఉంటుందా అంటే అదీ లేదు . వంట చెసుకొవలి. తనతో మాట్లాడుతున్నట్లే ఉంటుంది . ఈలోపలే హథాత్తుగా వీధిలోకి పరిగెత్తి ఏ కురగాయలవదినో పిలుస్తుంది . 'నిన్ననే బావ కూరలు తేచ్చాదు కదా ' అంటే 'మీ బావకి  ఓ పాలనా కూరంటే ఇష్టంరా! అది నిన్న దొరకలేదు కదా?' అంటుంది . ఈ లోపల స్టీలు సామానుల వాడు వస్తాడు . రెండు గంటలు సుతారంగా గడిచిపోతాయి . పథ చొక్కాలు, పంతులూ అమ్మకపోతే మీ బావ అవే వేసుకు తిరుగుతారు . చూడలేక మనం చావాలి' అంటుంది .
ప్రతి మాటలో బావగది ప్రసక్తి రాకుండా ఉండదు . మెడ మీద వదియలు ఎండబెట్టడమో ఇంటికి బూజులు దులపటమో , ఇంకే పనీ లేకపోతే పక్కింటి పనిమనిషిని పిలిచి ఇల్లంతా కదిగించటం . అసలు తనని తప్పించుకోవటం కోసమే పనులు కల్పించు కుంటోన్దనిపిన్తుంది .
'అక్కిలా అయిపోయిన్దేమిటి?' అనుకున్నాడు కిట్టూ .
కాని చిత్రంగా వాడికి అక్క పైన కోపం రాలేదు . సూర్యం పైన వచ్చింది .

మర్నాడు నిద్ర లేచేసరికి ఏడయ్యింది . రోజులాగే, ఈ రోజయినా అక్కతో కాస్త గడిపినట్లితే ఎంత బాగుండును? అనుకున్నాడు .

అక్క అప్పటికే హడావుడిగా ఉంది . కిట్టూ ని చూసి 'లేచావా మీ బావ ఆఫీసు కి టైం అయ్యిపోయింది . అయ్యో! ఇంకా ఒక్క పని కూడా కాలేదు . నువ్వెళ్ళి బావగారి బట్టలు ఇస్త్రీ చేసి పెట్టు . నేనింకా టిఫిన్ కూడా చెయ్యలేదు' అంది
వెంటనే  వంటింట్లోంచి బయటకి వెళ్తూ "హు!" అనుకున్నాడు .
ఈ లోపున అక్క రేడు మూడు సార్లయినా కంగారులో తలుపునో గడపనో తన్నుకుంది . పాల గిన్నె కిందకి దించుతూ తిరగేసింది . ఉల్లిపాయలు కోస్తూ చేయి తెగ్గోట్టుకుంది .అంత భయమెందుకో అర్థం కాలేదు కిట్టూ కి .
ఈలోపున 'నా షేవింగ్ సెట్టేదోయ్?' అని సూర్యం అరుపు .
కిట్టూ కి వాళ్ళు మండిపోయింది . కాని ఓపిగ్గా షేవింగ్ సెట్టూ , మగ్గులో  నీళ్ళు  పట్టికెళ్ళాడు. వేన్నీళ్లు కాచాడు .కాగిన నీళ్ళు బాత్రూం లో పెట్టాడు . స్నానం చేసాక తలుపు దగ్గరే నిల్చుని తువ్వాలు ఇస్త్రీ చేసిన బట్టలూ ఇచ్చాడు . ఇదంతా బావగాడి నుంఛి అక్కని రక్షించటానికే .
చివరికి 'నేను వెల్థున్నానొయ్ ' అని సూర్యం అక్క దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోయాడు .
అమ్మయ్య అనుకున్నాడు కిట్టూ . కాని అక్క ఇంకా వంటింట్లోనే ఉంది .
'ఇంకా ఇక్కదేమిటి వంట అయ్యిపోయిన్డిగా?' అన్నాడు
'ఎక్కడయ్యిన్దిరా నాయనా? గంటన్నలో చర్రిఅగె మనిషి వచ్చేస్తుంది . ఈ లోపల వంట చెయ్యాలి' అంది.
'నా నెత్తి' అనుకున్నాడు . పోనిలే ఇక్కడే కబుర్లు చెప్పుకుందాం .
'టీవీ చూడరా ఏమిన వస్తోందేమో?'
'ఇప్పుదేముంటాయి?'
'పోనీ టేప్ రికార్డర్ వింటావా?'.
అంటే నేను ఇక్కడ ఉండటానికి  వీల్లేదు
కోపంగా బైటికి వెళ్ళిపోయాడు .
కారియర్ పంపాక ఇద్దరూ భోం చేసారు .ఇక ఖాళీ గ ఉంటుందిలే అనుకుని కేరం బోర్డు కిందకు దించి బిల్లలన్నీ పేర్చి కూర్చున్నాడు కిట్టూ . కాని అక్క ఎంతకీ రావటం లేదు .
'ఇంకా ఎం చేస్తోంది?' అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళాడు .
అక్కడ అక్క పీత మీద కూర్చుని ఏదో పిండి కలుపుతూ ఉంది .
'మళ్ళీ ఇదేమిటి' అన్నాడు
'గులాబ్ జామూన్ చేస్తున్నాన్రా . నీక్కూడా ఇష్టమే కదా?'
నాక్కూడా ఇష్టమే అంటే? అసలు బావగాడికి ఇష్టమని చేస్తోంది . తనకి కూడా ఇష్టం కావటం అనుకోడుండా జరిగింది .
'ఇప్పట్నుంచి ఎందుకు చెయ్యటం?'
'ఏడిసినట్టుంది . ఇప్పుడు చేసి పాకంలో వేస్తే సాయంత్రానికి  బావ వచ్చేసరికి  బాగా వూరతాయి '
మొత్తానికి బావగాడి  ప్రసక్తి రాకుండా ఉండదుగా?
ఈసారి అక్క కూర్చోమని అంటున్నావినకుండా కోపంగా వెళ్ళిపోయాడు . సోఫామీద విసురుగా కుర్చుని 'చందమామ' చెడామడా చదవసాగదు. కాని ఒక లైను చదివాకా మళ్ళీ ఆ లినుకే వస్తున్నాడు తప్ప కథ కదలటం లేదు . 'చందమామ' నెలకి కొట్టి సోఫాలో మొఖం దాచుకుని పడుకున్నాడు .  నాలుగ్గంటలకి అక్క వచ్చే వరకు అలా పది ఉన్నాడు . కాని అక్క వచ్చి కేరం బోర్డు ముందు కూర్చోగానే వాడు కోపం మరిచిపోయి ఆడసాగాడు .
పట్టుమని రెండాతలు ఆడారో లేదో తలుపు చప్పుడయ్యింది . వచ్చినది బావగాడు కాకూడదని దేవుడిని అగిగేలోపల బావగాడు వచ్చేసాడు .
'రండి ఈరోజు త్వరగా వచ్చేసారు' అతని కోటు విప్పుతూ .
కిట్టూ కుళ్ళిపోతూ  చూస్తున్నాడు . బావగాడొస్తే  తన ధ్యాసే ఉండదక్కకి .
'మా బాస్ గడు ఏదో పనుంది వెళ్ళిపోయాడు . వాడి వెనకే మేమూ వచ్చేసాం ' అన్నాడు సూర్యం .
'సరే ముఖం కడుక్కోండి, కాఫీ ఇస్తాను'
కిట్టూ చూస్తున్నాడు. అక్క పొరపాటున కూడా తన వైపు చూడకుండా జాగ్రత్తపడుతోందని అర్ధమయ్యింది . ఇక ఆట ఆడటం జరిగేపని కాదు కనుక బిళ్ళలు డబ్బాలో వేస్తూ , తనని చూసి 'ఒరేయ్ ఉండరా, నేను వచ్చాక మల్లి ఆడదాం '  అని అక్క అంటున్దనుకున్నాడు . కాని అక్క అప్పటికే  కనుమరుగయిపోయింది . కిట్టూకి భరించలేనంత విరక్తి కలిగింది .
 'ఇక అక్క ఇలాగే ఉంటుంది కాబోలు అనుకున్నాడు .
'ఏమోయ్ బబ్లూ ఈరోజు ఎం చేసావు? ' అడిగాడు సూర్యం
కిట్టూ జవాబివ్వలేదు . 'బావగది' మొహం చూడాలంటె మండిపోతోంది .
'ఈరోజేలాగా త్వరగా వచ్చేసాను . సినిమా కి వెళ్దామా'
ఇక ఏదో చెప్పకతప్పదని 'దేనికి?' అన్నాడు .
'ఏదో ఒకటి .. అడవిరాముడు నీకు నచ్చుతుంది . ఏనుగులు ఉన్నాయి. ఎన్టీఆర్ కూడా ఉన్నాడు'
ఏ మాత్రం ఉత్సాహం లేకుండా 'మీ ఇష్టం' అన్నాడు
ముగురూ సినిమాకి వెళ్ళారు . సినిమా జరుగుతున్నంత సేపు అక్క కిట్టూతో సరిగా మాట్లాడటం లేదు . సూర్యం, అక్కా మాత్రం ఏమిటేమిటో మాట్లడేసుకున్తున్నారు . కిత్తోకి వాళ్ళు మండిపోతోంది . నిజానికి అక్క మద్య మద్యలో మాట్లాడుతోంది . 'ఒరేయ్ ఆ ఏనుగు చూసావా? పులి చూసావా' అంటూ . కాని కిట్టూకి అది చాలటం లేదు . తన కోపం అక్కకి తెలియకపోవటం వాడికి ఇంకా కోపం తెప్పిస్తోంది .
సినిమా అయ్యాక హోటల్ లో భో చేసి ఇంటికి వచ్చారు .
తలుపు తీయగానే ' అబ్బ నిద్రొస్తోంది.' అంది అక్క . 'నా కూనూ'అన్నాడు సూర్యం.
కిట్టూ బుంగ మూతి పెట్టుకుని సోఫాలో కూర్చున్నాడు .
'మళ్ళీ ఇక్కడ కుర్చున్నావేమిటి రా. ఇక పడుకో ' అంది అక్క .
ఆ మాటతోనే సూర్యం , అక్క ల బెడ్ రూం తలుపు మూసుకున్నాయి . మూసుకుపోయిన తలుపుల వైపు వెర్రిగా చూసాడు కిట్టూ . వాడికి కోపం, చిరాకూ ఏడుపూ అన్నీ ఒకేసారి వచ్చాయి . వాడి అసంతృప్తి అనుచుకోలేని స్థాయికి చేరిపోయింది . రోజంతటి లో అక్కకి తనతో మాట్లాడటానికీ,  ఆడుకోవటానికీ టైమే లేదు . అటువంటప్పుడు తనకి మాత్రం అక్కతో అవసరం ఏముంది?
వాడో నిర్ణయానికి వచ్చాడు . వచ్చినప్పట్నుంచి తన మనసులో రేగిన భావాలన్నీ తన భాషలో కసిగా వ్రాసాడు ,ఇక జన్మలో కోవూరు రాననీ, ఇదే ఆఖరి కలయిక అనీ వ్రాసి,  టేబుల్ మీద కాగితం ఉంచి బరువు పెట్టి తన సంచీ తో బైటికి వచ్చేసాడు . స్టేషన్ కి దారి తెలుసు కనుక నడక సాగించాడు . దారి పొడుగునా ఆలోచనలతో వాడి మనసు కాలిపోతోంది . పది నిమిషాలలో స్టేషన్ చేరుకున్నాడు .
నేరుగా స్టేషన్ మాస్టర్ దగ్గరకి వెళ్లి తన ఊరు పోయే రైలు ఎప్పుడుందని అడిగాడు . రేగిన జుట్టు తో , నలిగిన బట్టలతో నిల్చున్న కిట్టూ ని ఎగాదిగా చూసి 'మే ఊరికి ఇప్పుడెం బళ్ళున్నాయి ? ఇప్పుడు పోయేదే ఈ రోజుకి ఆఖరు బండి . ఇది మీ ఊర్నుంచే వచ్చి ఇంకా అటు పోతోంది . మీ ఊరికి పొద్దున్న ఆరు గంటలకే పాసెంజరొకటుంది ' అన్నాడు .
'అయినా రైలుందో లేదో తెలియకుండా ఎలా వచ్చావు? మీ పెద్దోల్లెలా పంపారు?' అని ఆయన అడుగుతోంటే జవాబివ్వకుండా స్టేషన్ లోకి వెళ్లి ఒక బెంచ్ మీద కూర్చున్నాడు . పొద్దున్న వరకూ అక్కడే ఉండిపోవాలని వాడి ఉద్దేశ్యం . ప్లాట్ ఫారం మీద కదలటానికి సిద్దం గా ఒక రైలుంది . తన ఊర్నుంచే వస్తోందన్నాడు ఇదే కాబోలు .
కిట్టూ కుర్చుని చూస్తూ ఉంటె హడావుడి గా   ఎర్ర చీర కట్టుకుని తన అక్క వయసు అమ్మాయొకావిడా , పక్కన బావగాదిలాగే లాల్చీ, పైజామా వేసుకున్న ఒక తెల్లటాయనా వచ్చేసారు . తెల్లటాయన  సామాను పెట్టెలో సర్దుతుంటే నెమ్మదిగా నడుచుకుంటూ ఓ కళ్ళ జోడు ముసలాయనా , తెల్ల జుట్టు ముసలావిడా వచ్చి ఎర్ర చీరమ్మాయి పక్కన నుంచున్నారు . అంతవరకూ కిట్టూ చూడనే లేదు . ఎర్ర చీరమ్మాయి చేతిలో గుడ్డల్లో దూరిపోయి కిట్టూ ఊహించనంత బుల్లి గా ఓ బుజ్జి పాపాయున్ది . ఎర్ర చీరమ్మాయి చేతుల్లో కళ్ళు  గాట్టి గా మూసేసుకుని నిద్ర పోతోంది .
'నువ్వు ముందు ఎక్కి కూర్చోమ్మా రైలు కడులుతుందేమో ' అంది ముసలావిడ .
 పాపాయి తల్లి మరెనన్నట్టు పాపాయిని జాగ్రత్తగా పట్టుకుని రైలెక్కి కిటికీ దగ్గరికొచ్చి కూర్చుంది .
'పాపాయి ఉన్నంత కాలం అది మూడు నెలల పిల్ల అయినా ఏమిటో బాగా కాలక్షేపం అయ్యేది . రేపట్నుంచి ఎలాగో?' అంది ముసలావిడ .
' రైలు కొన్ని నిముషములలో కదులును ' అని మైకులో చెప్పారు . హఠాత్తుగా ఎర్ర చీరమ్మాయి కళ్ళల్లోంచి నీళ్ళు జల జలా రాలి కిటికీ మీద మోచేయి అన్చిన ముసలావిడ మీద తప టపా పడ్డాయి . ఇక ఏడుపు వచ్చేసింది కనుక భోరుమందామే .
'ఊరుకోమ్మా ఏడవకు . ఆరు నెలల తర్వాత ఇప్పుడు నువ్వేల్లిపోతుంటే మాకు కూడా బాధ గానే ఉంది ' అంది ముసలావిడ కళ్ళు తుడుచుకుంటూ .
అల్లుడు బిక్క మొహం పెట్టాడు .
' పోనీ శాంతా ఇంకో నెల ఉంటావా' అన్నాడు
'ఏమ్మా ఉంటావా పోనీ?' అంది ముసలావిడ కూడా .
'వద్దమ్మా వారికి హోటల్ తిండి పడదు . ఇన్నాళ్ళూ ఎలాగో సద్దుకున్నారు . ఇక చాలు ' అంది ఎర్ర చీరమ్మాయి .
రైలు ఏడుస్తున్నట్టు కూసి కదిలింది . రెండు నిముషాల తర్వాత అంత నిశ్శబ్దం గా అయిపొయింది .
'నీకు బుద్దుందటే ? అల్లుడు అన్నాడు కదా అని నువ్వు కూడా దానిని ఉండిపోమ్మంటావా ? దానికి బుద్దుంది కనుక సరిపోయింది . లేకపోతే అల్లుడు ఎంత ఈబ్బన్ది పడునో !' అన్నాడు కళ్ళజోడాయన .
'దాని ఏడుపు చూసి భరించలేకపోయానండీ'
'ఎదిసినట్టే ఉంది . ఈ ఏడుపు అది ఒక ఏడాది ఉంది వెళ్ళినా ఉంటుంది . ఎప్పుడో ఒకప్పుడు దానింటికి అది వెళ్ళాలి . మనింట్లో  మనం ఉండాలి . పెళ్ళయ్యాక దానికి తల్లీ తండ్రీ అక్కా తమ్ముడూ కంటే మొగుడే ముఖ్యం .'
'నిజమేననుకొండీ కాని తల్లి ప్రాణం '
'అదే తప్పు . ఇప్పుడది నీ కూతురు కాదు . అప్పారావు పెళ్ళాం ......  '
అలా  మాట్లాడుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు . కిట్టూ ఒక్కడే మిగిలాడు . వాడికి ఎందుకో ఇందాక రైల్లో వెళ్ళిన ఎర్ర చీరమ్మాయి ఆమె అమ్మా నాన్నా మాట్లాడుకున్న విషయాలు గుర్తుకోస్తునాయి . అప్పుడే కొంచెం ఎదుగుతున్న మనసు ఆలోచించటం మొదలు పెట్టింది .

రేప్పొద్దున్న తను రైలెక్కి వెళ్ళిపోతాడు . ఇక అక్కకి ఉత్తరాలు కూడా వ్రాయడు . ఇంటి దగ్గర అక్కా బావ గాడూ తను రాసి పెట్టిన కాగితం చదువుతారు . తను వెళ్ళిపోయానని ఏడుస్తారు (శాస్తి జరుగుతుంది). తర్వాత తను చేరాడో లేదోనని కంగారు పడి ఇంటికి ఉత్తరం రాస్తే?
'అయ్యా బాబోయ్' లేచి నుంచున్నాడు
అప్పుడు తను అక్కకి చెప్పకుండా వచ్చేసినట్టు నాన్నకి తెలుస్తుంది . నాన్న తన తాట వలిచేస్తారు .  కోవూరు వస్తున్నపుడు  సార్లు చెప్పారు . అక్కదేమైన గొడవ చేస్తే చంపేస్తానని . ఇప్పుడీ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? బాబోయ్ ! వెంటనే వాళ్ళు నిద్ర లేచే లోపల వెళ్లిపోవాలి .
కిట్టూ గబా గబా స్టేషన్ బైటకు నడిచాడు . అసలు తన ఉత్తరం చదివి వాళ్ళు ఏడుస్తారనుకుని తను ఇలా వచ్చేయటమేమిటి ? పాపం వాళ్ళు కంగారు పడతారు . తన కోసం వెదుకుతారు . తను దొరక్కపోతే 'ఎలా వెళ్ళాడో? పాపం వాడిలా వెళ్ళేలా చేశామే అని బాధ పడతారు . ఛ ఛ ఎంత పొరపాటు చేసాను ?  వాలు నిద్ర లేచే లోపు ఇంటికి వెళ్లి పోవాలి .

వేగంగా ఇల్లు చేరి గేటు తీస్తూ ఆగిపోయాడు . ఇంటి వరండా దగ్గర తెరిచిన తలుపుని ఆనుకుని అక్క, సూర్యం నిల్చుని తను గేటు తెరుస్తుంటే చూసారు . 'తన ఉత్తరం గాని చదివేసారా?' అనుకుంటూంటే సూర్యం అక్క వైపు  తిరిగి ఏదో చెప్తున్నాడు .
దగ్గరగా వచ్చిన కిట్టూని చూసి నవ్వుతూ 'చూసావుటోయ్! నువ్వు వాకింగ్ కి వెళ్ళావంటే అక్క నమ్మటం లేదు .' అన్నాడు సూర్యం .
కిట్టూ వెర్రి మొహం పెట్టాడు .
'అయినా వాకింగ్ కి పోతున్న వాడివి నన్ను పిలిస్తే నేనూ వచ్చే వాడిని కదా?'
కిట్టూ సగం అర్ధంయ్యినట్టు నవ్వాడు .
'పద వెళ్లి కాళ్ళు కడుక్కో , ఈ రెండు నిముషాల్లో అక్క మొహం చూడు ఎలా అయిపోయిందో ' అన్నాడు సూర్యం 'మేము లేచి ఏంటో సేపు కాలేదులే' అన్నట్లు .
మౌనంగా  బాత్రూం లోకి వెళ్లి కాళ్ళు కడుక్కుని వచ్చాడు కిట్టూ . పశ్చాత్తాపం తో వాడి మనసు రగిలిపోతోంది . అంత తెలిసీ ఏమి తెలియనట్టు నటిస్తూ తనని మంచి చేసుకోవటానికి వాలు ప్రయత్నిస్తుంటే మరింత బాధ , వాళ్ళ మీద గౌరవం కలుగుతోంది .

'మంచి నీళ్ళు కావాలా?'
'వద్దు లెండి నేనింక పడుకుంటాను ' అన్నాడు కిట్టూ గొంతు సవరించుకుంటూ .
'ఆ పడుకో , బాగా పొద్దుపోయింది . నీ గదిలో బావుందా? లేక అక్క దగ్గర పడుకుంటావా?'
ఉలిక్కిపడ్డాడు కిట్టూ .
'నేను నా గదిలోనే పడుకుంటా లెండి ' అన్నాడు .
'సరే అయితే . రేప్పొద్దున్నే లేచిపోవాలి . రేపటి నీ ప్రోగ్రాం తయారయిపోయింది . నేనుండననుకో . ఆఫీసు పని మీద వెళ్లిపోవాలి . అక్క ఉంటుంది ' అన్నాడు సూర్యం .
'మీరు కూడా రావాలి బావ గారు' అన్నాడు కిట్టూ . ఇప్పుడతన్ని 'బావ గాడు ' అనుకోవలనిపించటం లేదు . సూర్యం తడ బడి 'నేనూ వద్దును కాని ఆఫీసు పని ఉంది కదా? అయినా రేపు చూద్దాం లే పడుకో' అన్నాడు .
కిట్టూ గదిలోకి వెళ్లి పడుకున్నాడు . ఇలా జరగక పోతే ఎంత బాగుండును? అనుకున్నాడు . వాడికి ఎప్పటికో మగత గా నిద్ర పడుతూ ఉంటె  బుగ్గల మీద చల్లగా తగిలింది . వెంటనే పక్కకి దొర్లి చూసేసరికి తనని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతున్న అక్క కనిపించింది .
'పిచ్చి తండ్రి ఇన్నాళ్ళూ ఎంత హింస పడిపోయాడో!' అంటోంది అక్క తలుపుకి అవతల నించున్న బావతో .
'వాడు అంతా మరిచిపోయి సంతోషం గా ఇంటికి వెళ్ళాలి . ఈ నాలుగు రోజులూ నాకేం పరవాలేదు గాని వాడిని క్షణం కూడా వదలకు ' అన్నాడు సూర్యం .
కిట్టూ చెంపల మీద నుంచి కన్నీళ్లు కారిపోయాయి .
'నన్ను మన్నించక్కా' అనుకున్నాడు .

(అంకితం: నాకు అక్క ప్రేమ అందించిన విజ్జక్క కి ఈ కథ అంకితం )

( సమాప్తం)

కామెంట్‌లు

  1. బాగుంది రాజమోహన్..కథ శాంతిగా ఉంది.

    మా అమ్మాయి మా అబ్బాయికన్నా 9 యేళ్ళు పెద్దది.. ఇది చదువుతుంటే వాళ్ళిలా ఉంటారేమో మున్ముందు అనిపించింది.

    రిప్లయితొలగించండి
  2. ఈ కథ లో చాల వరకు నా జీవితం లో జరిగిన సంఘటనలే . నా అక్క కి పెళ్లి కుదిరిన తర్వాత నుంచి నా కాబోయే బావ గారితో ఎక్కువగా మాట్లాడుతుటే తట్టుకోలేక స్టేషన్ కి వెల్లిపొయాను. నన్ను మా అమ్మ వెనక్కి తీసుకొచ్చింది. ఒక సారి నేను హౌరా నుంచి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి ఇలాగే కానుపు తర్వాత ఇంటికి వెళ్తోంది . ఈ రెండు సంఘటనలు కలుపుకుని ఈ కథ వ్రాయటం జరిగింది . ఎవరి కథలు వాళ్లకి బాగుంటాయి . ఈ కథ నాకు జ్యేష్ట గారి 'ఎర్ర తేలు' లా, రామారావు గారి 'యజ్ఞం' లా, ముళ్ళపూడి గారి 'కానుక' లా అనిపిస్తుంది . కాని పాఠకులు చెప్పాలి. మీ అభిప్రాయాలు అన్నీ విలువైనవే .

    రిప్లయితొలగించండి
  3. అర్థాంతరంగా లోకం వదిలి వెళ్ళిపోయిన మా అక్కను గుర్తు చేశారు.... చిన్నమ్మ కొడుకునే అయినా సొంత తమ్మున్ని మించి నన్ను చూసుకునేది...

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నమ్మకం అనే అలవాటు

"నమ్మకం మనందరికీ అవసరమైన అలవాటు" అన్నారు నాన్న.  ఈమధ్యనే నాన్న మాతో కొంచెం మాట్లాడుతున్నారు. నేనూ తమ్ముడు శ్యామూ అందుకని ఎంతో ఉత్సాహపడిపోయినా అప్పుడప్పుడు నాన్న చెప్పే విషయాలు చాలా ఇబ్బందికరంగా ఉండేవి.  మనుషులందరినీ మొదటే ఎలా నమ్మేస్తాం? నా ముఖం చూసి భావాలు అర్ధం చేసుకున్న నాన్న "మనుషులని నమ్మితే వచ్చే ఇబ్బందేమిటో చెప్పరా"  అని అడిగారు.  "వాళ్ళు మనకి పూర్తిగా తెలియనప్పుడు వాళ్ళు మోసగాళ్లు అయ్యే అవకాశం ఉంది" అన్నాను భయం గానే.  "సరే! నమ్మకపోతే మానని ఎవరూ మోసం చెయ్యరా?" నేను ఒక క్షణం ఆలోచించి "అయినా మోసం చెయ్యచ్చు. కానీ అవకాశం కొంత మందికే" అన్నాను.  "ఆ కొంత మంది ఎవరో తెలుసా?"  "ఎలా తెలుస్తుంది?"  "...." "మీ నంభావనీయతా శాస్త్రం ప్రకారం ఏ ప్రయత్నానికైనా ఫలితాలు రెండే జరిగే అవకాశం ఉన్నపుడు ఒక్కొక్క ఫలితానికి అవకాశం యాభై శాతం ఉంటుంది. అంటే నమ్మి మోసపోవటానికీ నమ్మకపోయినా మోసపోవటానికీ అవకాశాలు సమానం. అటువంటపుడు నమ్మితేనే మంచిది కదా! ఎవరినీ నమ్మకపోవటం ద్వారా మనం నిజాయితీ పరులని అవమానిస్తున్నాం. అయినా మోసపోతున్నా

అరుణ్ గాడి చదువు

"ఏమండీ! అరుణ్ గాడిని కాన్వెంట్ లో చేర్పించాలండీ " అంది సుబ్రహ్మణ్యం భార్య సావిత్రి . నెల రోజుల నుంచి రావలసి ఉన్నా రాని  ప్రమోషన్ రిజల్ట్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న సుబ్రహ్మణ్యం తలెత్తి చూసాడు . "అరుణ్ గాడిని నర్సరీ లో చేర్పించాలి . ఇంటర్వ్యూ కి వారమే టైముంది." అందామె . "వాట్? ఇంటర్వ్యూ నా?" ఆశ్చర్యపోయాడు సుబ్రహ్మణ్యం . మేనేజర్ ప్రమోషన్ కోసం రెండు నెలల క్రితం ఇంటర్వ్యూ కి వెళ్లి వచ్చిన అతనికి తన మూడేళ్ళ కొడుక్కి ఇంటర్వ్యూ ఉందన్న విషయం చాలా అవమానం కలిగించింది . "అదేమిటండీ అలా అంటారు? ఇదేమైన మీరు చదువుకున్న దుంపల బడి అనుకున్నారా? పిలిచి సీటివ్వతానికి నర్సరీ లో చేరటానికి ఇంటర్వ్యూ ఉండదూ?" ఆవిడ మాటలు అక్షరాలా నిజం . సుబ్రహ్మణ్యం నీరసంగా పడక్కుర్చీ లో వెనక్కి వాలి తన కొడుకు వైపు చూసాడు . అతని సుపుత్రుడు అరుణ్ అక్కడే నేల మీద కూర్చుని లక్కముక్కలతో రైల్వే స్టేషన్ తయారు చేస్తున్నాడు . వాడు రోజు తొమ్మిది గంటలకు నిద్ర లేస్తునాడు . వాడికి నచ్చినప్పుడు తయారై పక్కింటి గర్ల్ ఫ్రెండ్ తో ఆడుకుంటాడు . రాత్రి టీవీ చూస్తూ అందులో వచ్చే పాటలకి ఓపికు