ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఆగస్టు, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది

బుల్లి నాన్నచెప్పిన పెదనాన్న కథలు : తాతబ్బాయి

బుల్లి నాన్న చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. అక్కడ బుల్లి నాన్న కి ఒక బుల్లి స్నేహితుడు సన్యాసి రాజు. వీళ్ళిద్దరూ చదువైనా ఆటలైనా పాటలైనా ఇంటి పనులైనా ఇంకేమైనా కలిసే చేసేవారు. వీళ్ళిద్దరూ ఒకే బడి లో చదువుకునేవారు. ఒక్కొక్క తరగతిలోనూ నూరూ నూట యాభై మంది ఉన్నా అందరూ వీరికి స్నేహితులే. వారిలో తాతబ్బాయి ఒకడు. తాతబ్బాయి చాలా మంచి వాడు. ఎప్పుడూ ఒకరకమైన అమాయకమైన ముఖం తో ఉండే తాతబ్బాయి అంటే అందరికీ అభిమానమే! తాతబ్బాయికి ఉన్న ఒకే ఒక్క సమస్య ఏమిటంటే గురువులు చెప్పే ఒక్క ముక్కా అతనికి కొంచెం కూడా అర్ధం కాకపోవటం. పాపం వాడు శాయశక్తులా ప్రయత్నించినా ప్రతి గురువు కీ వాడొక తీరని సమస్యగా ఉండే వాడు.  బుల్లి నాన్నా , సన్యాసి రాజూ ఇద్దరూ జాలిపడి వాడికి వీలయినంత సహాయం చేసేవారు. ఎన్నో సార్లు వాడి హోమ్ వర్క్ వీళ్ళే చేసేవారు. అది కాక వాడికి అర్ధమయ్యేలా పాఠాలు మళ్ళీ చెప్తూండే వారు.  అయినా వాడికి ఏమీ అర్ధమయ్యేది కాదు.  తాతబ్బాయికి చదువే సమస్య గా ఉంటె బుల్లి నాన్న కీ ఇంకా అందరికీ చదువులో ఒక పెద్ద సమస్య ఉండేది. అది హిందీ భాష !!! మన దేశ భాష అయిన హిందీ అందరూ నేర్చుకోవాలని హిందీ ఉపాధ్యాయిని గాయత