ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

నవంబర్, 2013లోని పోస్ట్‌లను చూపుతోంది

ఒక జీవిత కాలం - మొదటి భాగం

దిలీప్ కి చిన్నప్పుడు పుస్తకాల పురుగు, ఆదర్శ విధ్యార్థి వంటి బిరుదుల చాలా ఉండేవి. కాని ఎప్పుడూ తను చాలా మంది ముందు తను చాలా తక్కువ అనే అనుకునే వాడు. పోటీ తత్వం అనేది చిన్నతనం నుండి లేదు. ఏ పాఠమైనా పూర్తి గా చదువుకోవాలి అనే తప్ప పోటీ ఉండేది కాదు. ఒక సారి ఒక చిన్న పరీక్ష పెట్టి గురువు గారు మార్కులు ఇచ్చారు. దిలీప్ వెనక్కి ఇచ్చిన పేపర్ చూసుకుంటున్నాడు ఎక్కడెక్కడ తప్పులు చేసాడో నని. అప్పుడు వచ్చాడు అతని స్నేహితుడు అప్పల రాజు.  "ఒరేయ్ నీకెన్ని మార్కులు వచ్చాయిరా?" అని అడిగాడు.  "ఇరవై మూడు  వచ్చాయిరా!" అన్నాడు.  వాడు వాడి పేపర్ లో చూసుకుని "బలరామ్ కి ఎన్ని వచ్చాయి?" అన్నాడు.  "తెలియదు రా!" అన్నాడు. అతనికి జవాబు చెప్పలేక పోయినందుకు కొంచెం బాధ కలిగింది. అప్పలరాజు అంతగా పట్టించుకోకుండా వెంటనే వెళ్లి బలరాం కి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకుని వచ్చాడు.  "వాడికి ఇరవై రెండు" అన్నాడు. "చలపతి కి ఇరవై" అని కూడా చెప్పాడు.  "మరి నీకో?" అన్నాడు దిలీప్ నోరు తెరుచుకుని.  "నాకు కూడా ఇరవై రెండు" అన్నాడు ఒక ముఖం పెట్టుక