ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

2021లోని పోస్ట్‌లను చూపుతోంది

యడ్ల హనుమంతూ సామాజిక స్పృహా

"నేను మంచి సామాజిక స్పృహతో నిండిన కొన్ని కథలు రాసానోయ్"అంటూ నా గదిలోకి వచ్చి కూర్చున్నాడు యడ్ల హనుమంతు మరే ఉపోద్ఘాతమూ లేకుండా.  "ఏమిటవి?" అని అడిగాను ఈ ప్రశ్న అడగటం అంటే యడ్ల హనుమంతు అనే  కొరివితో నా బుర్ర గోక్కోవటమే అని తెలిసినా.  ఏమాత్రం మొహమాటం లేకుండా మొదలుపెట్టేశాడు వాడు.  "ఈ కథ పేదవారి నిస్సహాయతపై ధనికులు ఆడుకునే ఆట గురించి. అంటే మూర్తి లాంటి వెధవల గురించి అన్నమాట. (మూర్తి మా ఇంటి ఓనర్. ఏమాట కామాట. చాలా మంచివాడు!). ఒక కుటుంబరావు కి అయిదుగురు కూతుళ్ళూ ఒక కొడుకూ నూ. బడిపంతులు గా రిటైర్ అయిన అతనికి ప్రతిదినమూ అతికష్టం మీద గడుస్తూ ఉంటుంది. కొడుకింకా పదో క్లాసే చదువుతుండటం వలన కుటుంబ భారమంతా కుటుంబరావు మీదే . ఆ లోపున అతని మూడో కూతురిని పెళ్లి చేసుకోవటానికి ఒకడు ఒప్పుకుంటాడు. కానీ ఆ దుర్మార్గుడు మూడు లక్షల రూపాయల కట్నం అడుగుతాడు. కట్నం ఇవ్వలేక కుటుంబరావు కాబూలీ వాలా దగ్గరికి వెళ్తే 'నీకూతురిని రాత్రికి పంపు. డబ్బిస్తా'అంటాడు. అవమానంతో ఆ పంతులు ఆత్మహత్య ..... "అని హనుమంతు ఆవేశంతో చెప్పుకుపోతుంటే -  "ఆగాగు" అన్నాను.  చాలా అయిష్టంతో కథ ఆపినా