ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జనవరి, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది

కొవ్వొత్తి ప్రవ్రుత్తి

ఇంటి గుమ్మం తెరుచుకుని ఇంట్లోకి వస్తుంటే 'నిరసన బాగా జరిగిందా?' అంటూ ఎదురొచ్చింది నా భార్య. అప్పుడే నేను కొన్నివందల మంది సహచరులతో అన్ని రహదారుల మీదా కొవ్వొత్తుల నిరసన విజయవంతంగా చేసి వస్తున్నాను.సత్యేంద్ర దూబే అనే ఒక నిజాయితీ పరుడు ప్రభుత్వం లో జరుగుతున్న కొన్ని దారుణాలు ప్రధానమంత్రి కార్యాలయానికి పిర్యాదు రూపం లో మనవి చేసుకున్న కొన్నిరోజుల్లోనే అతన్ని దారుణంగా "ఎవరో" చంపేశారు. ఈ వార్తలు చూడగానే మా అందర్లోనూ ఆవేశం చెలరేగింది. నాతొ పని చేసే సహచరులతో పాటు మాకు బొగ్గు సరఫరా చేసే కంపెనీ లోనూ ఇంకా చుట్టు పక్కల ఉన్న కంపెనీ ల లోనూ పని చేసే వారందరం కలిసి కొవ్వొత్తులతో మా నిరసన వ్యక్తం చేసాం. ఈ నిరసన చాలా బాగా జరిగిందనీ ప్రఖ్యాత ప్రసార కేంద్రాల ప్రతినిధులంతా అక్కడే ఉండి సమాచారం ప్రసారం చేశారనీ మొత్తానికి ఈ నిరసన విజయవంతమయ్యిందనీ నా సహచరులు నాకు చెప్పారు. సమాజం లో జరిగే అన్యాయాలని నిరసించి అవినీతి పరులని కడిగేయటం లో మా జట్టు చాలానే ముందుకు పోతోంది. మొన్నటికి మొన్న క్రికెట్ లో జరిగిన అవినీతి కి నిరసనగా మేమంతా 10K మారథాన్ చేసి వార్తలో కెక్కాము. అందుకే నా

వికాసం

నేను ఉద్యోగం లో చేరిన కొత్తరోజులు. అప్పుడే ఒక సంవత్సరం శిక్షణ  పూర్తి చేసుకుని పశ్చిమ వంగ దేశం లో ఫరక్కా అనే చిన్న గ్రామం లో నడుపుతున్న విద్యుత్కేంద్రం లో పని ప్రారంభించి రెండు నెలలు కావస్తోంది. 16 రోజుల్లో నాకు నాలుగో సంవత్సరం పరీక్షలు ఉన్నాయనగా నాన్న మా కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయినప్పటి నుంచి నాకు ఉద్యోగం చాల అవసరమయ్యింది. ఖరగపూర్ లో పెద్ద చదువు కి చేరినా ఉద్యోగ ప్రయత్నాలు మానలేదు.  చివరకి ఈ ఉద్యోగం ఖరారయ్యింది. నాన్న లేని బెంగని మరిచిపోవటానికి నా దృష్టంతా పని లోకి మళ్లించుకుని మొదటి సంవత్సరం శిక్షణ లో ప్రథమ స్తానం లో ఉత్తీర్ణుడినయ్యాను. చివరి ఆరు నెలల శిక్షణ లో నేను అన్ని విభాగాలలోనూ ఒక్కొక్క వారం కూర్చుని అంతవరకూ నేర్చుకున్న విద్యని ఆచరణ లో పెట్టటం లో కూడా ప్రావీణ్యం సంపాదించాను. మా విద్యుత్కేంద్రానికి ఉన్నతాధికారి ప్రత్యేకంగా నేను కూర్చునే కార్యాలయానికి వచ్చి మా జట్టులో అందరికన్నా ఉన్నత  స్థాయిలో నేను ప్రదర్శించిన పనితీరు గురించి నన్ను నా సహచరుల ముందు అభినందించారు. పెద్దల నుంచి ముఖ్యంగా నాన్న నుంచి రావలసిన తోడ్పాటు లేని నాకు అప్పుడు ఎంతో సంతోషం ఉద్వేగం నా మీద నాకు నమ్మకం కలిగాయ