ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

నమ్మకం అనే అలవాటు

"నమ్మకం మనందరికీ అవసరమైన అలవాటు" అన్నారు నాన్న.  ఈమధ్యనే నాన్న మాతో కొంచెం మాట్లాడుతున్నారు. నేనూ తమ్ముడు శ్యామూ అందుకని ఎంతో ఉత్సాహపడిపోయినా అప్పుడప్పుడు నాన్న చెప్పే విషయాలు చాలా ఇబ్బందికరంగా ఉండేవి.  మనుషులందరినీ మొదటే ఎలా నమ్మేస్తాం? నా ముఖం చూసి భావాలు అర్ధం చేసుకున్న నాన్న "మనుషులని నమ్మితే వచ్చే ఇబ్బందేమిటో చెప్పరా"  అని అడిగారు.  "వాళ్ళు మనకి పూర్తిగా తెలియనప్పుడు వాళ్ళు మోసగాళ్లు అయ్యే అవకాశం ఉంది" అన్నాను భయం గానే.  "సరే! నమ్మకపోతే మానని ఎవరూ మోసం చెయ్యరా?" నేను ఒక క్షణం ఆలోచించి "అయినా మోసం చెయ్యచ్చు. కానీ అవకాశం కొంత మందికే" అన్నాను.  "ఆ కొంత మంది ఎవరో తెలుసా?"  "ఎలా తెలుస్తుంది?"  "...." "మీ నంభావనీయతా శాస్త్రం ప్రకారం ఏ ప్రయత్నానికైనా ఫలితాలు రెండే జరిగే అవకాశం ఉన్నపుడు ఒక్కొక్క ఫలితానికి అవకాశం యాభై శాతం ఉంటుంది. అంటే నమ్మి మోసపోవటానికీ నమ్మకపోయినా మోసపోవటానికీ అవకాశాలు సమానం. అటువంటపుడు నమ్మితేనే మంచిది కదా! ఎవరినీ నమ్మకపోవటం ద్వారా మనం నిజాయితీ పరులని అవమానిస్తున్నాం. అయినా మోసపోతున్నా
ఇటీవలి పోస్ట్‌లు

యడ్ల హనుమంతూ సామాజిక స్పృహా

"నేను మంచి సామాజిక స్పృహతో నిండిన కొన్ని కథలు రాసానోయ్"అంటూ నా గదిలోకి వచ్చి కూర్చున్నాడు యడ్ల హనుమంతు మరే ఉపోద్ఘాతమూ లేకుండా.  "ఏమిటవి?" అని అడిగాను ఈ ప్రశ్న అడగటం అంటే యడ్ల హనుమంతు అనే  కొరివితో నా బుర్ర గోక్కోవటమే అని తెలిసినా.  ఏమాత్రం మొహమాటం లేకుండా మొదలుపెట్టేశాడు వాడు.  "ఈ కథ పేదవారి నిస్సహాయతపై ధనికులు ఆడుకునే ఆట గురించి. అంటే మూర్తి లాంటి వెధవల గురించి అన్నమాట. (మూర్తి మా ఇంటి ఓనర్. ఏమాట కామాట. చాలా మంచివాడు!). ఒక కుటుంబరావు కి అయిదుగురు కూతుళ్ళూ ఒక కొడుకూ నూ. బడిపంతులు గా రిటైర్ అయిన అతనికి ప్రతిదినమూ అతికష్టం మీద గడుస్తూ ఉంటుంది. కొడుకింకా పదో క్లాసే చదువుతుండటం వలన కుటుంబ భారమంతా కుటుంబరావు మీదే . ఆ లోపున అతని మూడో కూతురిని పెళ్లి చేసుకోవటానికి ఒకడు ఒప్పుకుంటాడు. కానీ ఆ దుర్మార్గుడు మూడు లక్షల రూపాయల కట్నం అడుగుతాడు. కట్నం ఇవ్వలేక కుటుంబరావు కాబూలీ వాలా దగ్గరికి వెళ్తే 'నీకూతురిని రాత్రికి పంపు. డబ్బిస్తా'అంటాడు. అవమానంతో ఆ పంతులు ఆత్మహత్య ..... "అని హనుమంతు ఆవేశంతో చెప్పుకుపోతుంటే -  "ఆగాగు" అన్నాను.  చాలా అయిష్టంతో కథ ఆపినా

బుల్లి నాన్నచెప్పిన పెదనాన్న కథలు : తాతబ్బాయి

బుల్లి నాన్న చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. అక్కడ బుల్లి నాన్న కి ఒక బుల్లి స్నేహితుడు సన్యాసి రాజు. వీళ్ళిద్దరూ చదువైనా ఆటలైనా పాటలైనా ఇంటి పనులైనా ఇంకేమైనా కలిసే చేసేవారు. వీళ్ళిద్దరూ ఒకే బడి లో చదువుకునేవారు. ఒక్కొక్క తరగతిలోనూ నూరూ నూట యాభై మంది ఉన్నా అందరూ వీరికి స్నేహితులే. వారిలో తాతబ్బాయి ఒకడు. తాతబ్బాయి చాలా మంచి వాడు. ఎప్పుడూ ఒకరకమైన అమాయకమైన ముఖం తో ఉండే తాతబ్బాయి అంటే అందరికీ అభిమానమే! తాతబ్బాయికి ఉన్న ఒకే ఒక్క సమస్య ఏమిటంటే గురువులు చెప్పే ఒక్క ముక్కా అతనికి కొంచెం కూడా అర్ధం కాకపోవటం. పాపం వాడు శాయశక్తులా ప్రయత్నించినా ప్రతి గురువు కీ వాడొక తీరని సమస్యగా ఉండే వాడు.  బుల్లి నాన్నా , సన్యాసి రాజూ ఇద్దరూ జాలిపడి వాడికి వీలయినంత సహాయం చేసేవారు. ఎన్నో సార్లు వాడి హోమ్ వర్క్ వీళ్ళే చేసేవారు. అది కాక వాడికి అర్ధమయ్యేలా పాఠాలు మళ్ళీ చెప్తూండే వారు.  అయినా వాడికి ఏమీ అర్ధమయ్యేది కాదు.  తాతబ్బాయికి చదువే సమస్య గా ఉంటె బుల్లి నాన్న కీ ఇంకా అందరికీ చదువులో ఒక పెద్ద సమస్య ఉండేది. అది హిందీ భాష !!! మన దేశ భాష అయిన హిందీ అందరూ నేర్చుకోవాలని హిందీ ఉపాధ్యాయిని గాయత

కొవ్వొత్తి ప్రవ్రుత్తి

ఇంటి గుమ్మం తెరుచుకుని ఇంట్లోకి వస్తుంటే 'నిరసన బాగా జరిగిందా?' అంటూ ఎదురొచ్చింది నా భార్య. అప్పుడే నేను కొన్నివందల మంది సహచరులతో అన్ని రహదారుల మీదా కొవ్వొత్తుల నిరసన విజయవంతంగా చేసి వస్తున్నాను.సత్యేంద్ర దూబే అనే ఒక నిజాయితీ పరుడు ప్రభుత్వం లో జరుగుతున్న కొన్ని దారుణాలు ప్రధానమంత్రి కార్యాలయానికి పిర్యాదు రూపం లో మనవి చేసుకున్న కొన్నిరోజుల్లోనే అతన్ని దారుణంగా "ఎవరో" చంపేశారు. ఈ వార్తలు చూడగానే మా అందర్లోనూ ఆవేశం చెలరేగింది. నాతొ పని చేసే సహచరులతో పాటు మాకు బొగ్గు సరఫరా చేసే కంపెనీ లోనూ ఇంకా చుట్టు పక్కల ఉన్న కంపెనీ ల లోనూ పని చేసే వారందరం కలిసి కొవ్వొత్తులతో మా నిరసన వ్యక్తం చేసాం. ఈ నిరసన చాలా బాగా జరిగిందనీ ప్రఖ్యాత ప్రసార కేంద్రాల ప్రతినిధులంతా అక్కడే ఉండి సమాచారం ప్రసారం చేశారనీ మొత్తానికి ఈ నిరసన విజయవంతమయ్యిందనీ నా సహచరులు నాకు చెప్పారు. సమాజం లో జరిగే అన్యాయాలని నిరసించి అవినీతి పరులని కడిగేయటం లో మా జట్టు చాలానే ముందుకు పోతోంది. మొన్నటికి మొన్న క్రికెట్ లో జరిగిన అవినీతి కి నిరసనగా మేమంతా 10K మారథాన్ చేసి వార్తలో కెక్కాము. అందుకే నా

వికాసం

నేను ఉద్యోగం లో చేరిన కొత్తరోజులు. అప్పుడే ఒక సంవత్సరం శిక్షణ  పూర్తి చేసుకుని పశ్చిమ వంగ దేశం లో ఫరక్కా అనే చిన్న గ్రామం లో నడుపుతున్న విద్యుత్కేంద్రం లో పని ప్రారంభించి రెండు నెలలు కావస్తోంది. 16 రోజుల్లో నాకు నాలుగో సంవత్సరం పరీక్షలు ఉన్నాయనగా నాన్న మా కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయినప్పటి నుంచి నాకు ఉద్యోగం చాల అవసరమయ్యింది. ఖరగపూర్ లో పెద్ద చదువు కి చేరినా ఉద్యోగ ప్రయత్నాలు మానలేదు.  చివరకి ఈ ఉద్యోగం ఖరారయ్యింది. నాన్న లేని బెంగని మరిచిపోవటానికి నా దృష్టంతా పని లోకి మళ్లించుకుని మొదటి సంవత్సరం శిక్షణ లో ప్రథమ స్తానం లో ఉత్తీర్ణుడినయ్యాను. చివరి ఆరు నెలల శిక్షణ లో నేను అన్ని విభాగాలలోనూ ఒక్కొక్క వారం కూర్చుని అంతవరకూ నేర్చుకున్న విద్యని ఆచరణ లో పెట్టటం లో కూడా ప్రావీణ్యం సంపాదించాను. మా విద్యుత్కేంద్రానికి ఉన్నతాధికారి ప్రత్యేకంగా నేను కూర్చునే కార్యాలయానికి వచ్చి మా జట్టులో అందరికన్నా ఉన్నత  స్థాయిలో నేను ప్రదర్శించిన పనితీరు గురించి నన్ను నా సహచరుల ముందు అభినందించారు. పెద్దల నుంచి ముఖ్యంగా నాన్న నుంచి రావలసిన తోడ్పాటు లేని నాకు అప్పుడు ఎంతో సంతోషం ఉద్వేగం నా మీద నాకు నమ్మకం కలిగాయ

ఒక జీవిత కాలం - మొదటి భాగం

దిలీప్ కి చిన్నప్పుడు పుస్తకాల పురుగు, ఆదర్శ విధ్యార్థి వంటి బిరుదుల చాలా ఉండేవి. కాని ఎప్పుడూ తను చాలా మంది ముందు తను చాలా తక్కువ అనే అనుకునే వాడు. పోటీ తత్వం అనేది చిన్నతనం నుండి లేదు. ఏ పాఠమైనా పూర్తి గా చదువుకోవాలి అనే తప్ప పోటీ ఉండేది కాదు. ఒక సారి ఒక చిన్న పరీక్ష పెట్టి గురువు గారు మార్కులు ఇచ్చారు. దిలీప్ వెనక్కి ఇచ్చిన పేపర్ చూసుకుంటున్నాడు ఎక్కడెక్కడ తప్పులు చేసాడో నని. అప్పుడు వచ్చాడు అతని స్నేహితుడు అప్పల రాజు.  "ఒరేయ్ నీకెన్ని మార్కులు వచ్చాయిరా?" అని అడిగాడు.  "ఇరవై మూడు  వచ్చాయిరా!" అన్నాడు.  వాడు వాడి పేపర్ లో చూసుకుని "బలరామ్ కి ఎన్ని వచ్చాయి?" అన్నాడు.  "తెలియదు రా!" అన్నాడు. అతనికి జవాబు చెప్పలేక పోయినందుకు కొంచెం బాధ కలిగింది. అప్పలరాజు అంతగా పట్టించుకోకుండా వెంటనే వెళ్లి బలరాం కి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకుని వచ్చాడు.  "వాడికి ఇరవై రెండు" అన్నాడు. "చలపతి కి ఇరవై" అని కూడా చెప్పాడు.  "మరి నీకో?" అన్నాడు దిలీప్ నోరు తెరుచుకుని.  "నాకు కూడా ఇరవై రెండు" అన్నాడు ఒక ముఖం పెట్టుక

ఆరాధన

ఆరాధన  రచన జనవరి 2014 లో ప్రచురింపబడింది  ఆరాధన  గడియారం ఎనిమిది గంటలు కొట్టింది. దిలీప్ తలెత్తి చూసాడు .అప్పటికి తన సహోద్యోగులంతా వచ్చి ఉన్నారు. ప్రతి రోజూ ఇలాగే వస్తారు. కానీ ఇక్కడ అందరూ హాజరు కావాలని నియమం లేదు. అసలు రోజూ హాజరు ఇవ్వవలసిన పని లేనే లేదు. సాంకేతికంగా అనుకూలించటం వలన వారు ఈ పనులు ఎక్కడినుంచయినా పని చేసుకోవచ్చు. అంతా నమ్మకం మీద నడుస్తుంది. పని ఎంత జరిగింది అన్నది ముఖ్యం. ఎన్ని గంటలు పని లో కూర్చున్నారు అని కాదు. అతను అతని సహధ్యాయులూ అందరూ ఒకే పెద్ద గది లో కూర్చుంటారు. కేవలం పొద్దున్న ఒక రెండు గంటలు దిలీప్ తన కోసం కేటాయించిన చిన్న గది లో ఏమైయినా సున్నితమైన విషయాలు నిర్వహించటానికి కూర్చుంటాడు. ఎనిమిది గంటల తర్వాత నుండి ఆ గది తలుపు మీద "walk in" అని రాసి ఉంటుంది. అంటే ఎవరైనా ముందస్తు గా అనుమతి తీసుకోక పోయినా రావచ్చు. ఆ తర్వాత దిలీప్ పెద్ద గది లో కూర్చుని సహాధ్యాయులతో పని చేసుకుంటాడు.  "స్నేహమంటే రోజు సరదా గా కలిసి కాఫీ తాగటం కాదు. అవసరమైనప్పుడు పక్కన ఉండాలి"  చటుక్కున తలఎత్తాడు దిలీప్. బోధిసత్వ కార్యాలయం లో ఉద్యోగస్తులు టీవీ చూస్తున్నారు.(పని