ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఆడది అబలా?

"నువ్వు లేకపోతే నేను బతకలేను రాణీ !" అన్నాడు రాజు .  "నువ్వు ఉంటేనే బతుకంటూ ఉంది రాజ్!" అండ్ రాణి  "ఐ లవ్ యు హనీ " "ఐ లవ్ యు జానీ" ఇద్దరూ ఒకరి కళ్ళల్లో ఒకరు విశాఖ బీచ్ లో వెన్నెల మెరుపులో చూసుకుంటూ ఉండిపోయారు .  'ఎవరది?' అని హుంకరించిన గొంతు వినిపించగానే కప్ప ని తొక్కినట్టు ఉలిక్కిపడ్డాడు రాజు .  'మిమ్మల్నే అడుగుతున్నాను . ఎవరు మీరు? ఇంత రాత్రి మీకేం పని?' అంటూ టార్చి లైటు ముఖాల మీదికి ఫోకస్ చేసాడు పోలీసు . పోలీసుకి ఏ మాత్రం కళా హృదయం  ఉన్నా 'ఏం  పని  మీకు ' అని మాత్రం అడిగే వాడు కాదు . 'ఐ యాం   రాజు ఎమ్మే .  థిస్  ఈస్  రాణి ...."ప్రమాదం లో ఇంగ్లీష్ మాట్లాడితే పని జరుగుతుందనే నమ్మకం తో కొనసాగిన్తుండగా ...  'ఇంగిలీసాపవయ్యా " అన్నాడు పోలీసు .  ఇంగ్లీష్ ఆపటంతో రాజు నోట మాట కూడా ఆగిపోయింది .  రాజూ రాణీ ప్రేమించుకుంటున్నారనీ కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదనీ కనుకే రాత్రి పన్నెండు గంటలకి బీచ్ లో ఉన్నారనీ ఏ తల మాసిన వాడికైనా అర్థమవుతుంది . కానీ మాయటానికి త...

అరుణ్ గాడి చదువు

"ఏమండీ! అరుణ్ గాడిని కాన్వెంట్ లో చేర్పించాలండీ " అంది సుబ్రహ్మణ్యం భార్య సావిత్రి . నెల రోజుల నుంచి రావలసి ఉన్నా రాని  ప్రమోషన్ రిజల్ట్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న సుబ్రహ్మణ్యం తలెత్తి చూసాడు . "అరుణ్ గాడిని నర్సరీ లో చేర్పించాలి . ఇంటర్వ్యూ కి వారమే టైముంది." అందామె . "వాట్? ఇంటర్వ్యూ నా?" ఆశ్చర్యపోయాడు సుబ్రహ్మణ్యం . మేనేజర్ ప్రమోషన్ కోసం రెండు నెలల క్రితం ఇంటర్వ్యూ కి వెళ్లి వచ్చిన అతనికి తన మూడేళ్ళ కొడుక్కి ఇంటర్వ్యూ ఉందన్న విషయం చాలా అవమానం కలిగించింది . "అదేమిటండీ అలా అంటారు? ఇదేమైన మీరు చదువుకున్న దుంపల బడి అనుకున్నారా? పిలిచి సీటివ్వతానికి నర్సరీ లో చేరటానికి ఇంటర్వ్యూ ఉండదూ?" ఆవిడ మాటలు అక్షరాలా నిజం . సుబ్రహ్మణ్యం నీరసంగా పడక్కుర్చీ లో వెనక్కి వాలి తన కొడుకు వైపు చూసాడు . అతని సుపుత్రుడు అరుణ్ అక్కడే నేల మీద కూర్చుని లక్కముక్కలతో రైల్వే స్టేషన్ తయారు చేస్తున్నాడు . వాడు రోజు తొమ్మిది గంటలకు నిద్ర లేస్తునాడు . వాడికి నచ్చినప్పుడు తయారై పక్కింటి గర్ల్ ఫ్రెండ్ తో ఆడుకుంటాడు . రాత్రి టీవీ చూస్తూ అందులో వచ్చే పాటలకి ఓపికు...

ఓ తమ్ముడి కథ

MAY 1994 - RACHANA TELUGU MAGAZINE " ఏం బాబూ నువ్వు దిగవలసినది కొవ్వురేనా? "  ఆలోచనల్లో ఉన్న కిట్టూ జవాబివ్వలేదు . "ఏవయ్యోవ్ నిన్నే" - అతన్ని కదిపింది ముసలావిడ . అప్పుడు తెలివి తెచ్చుకుని ఏమిటన్నట్టు చూసాడు కిట్టూ .  "నువ్వు కొవ్వూరులో దిగాలన్నావా లేదా? "  "అవునండి" "మరి కొవ్వూర్లో రైలాగి ఇంతసేపయింది . ఎమాలోచిన్స్తున్నావ్ ?" "ఆ! కొవ్వురోచ్చేసిండా?" అంటూ గబగబా రైలు దిగాడు కిట్టూ .  "ఇదిగో నీ సంచీ మరిచిపోయావు ." అని అందించిన్దావిడ కిటికీలోంచి . కిట్టూ సంచీ తీసుకుని ముందుకి నడవబోతూ రైలు పెట్టేలన్నింట్లో తొంగి చూస్తూ వస్తున్న సూర్యాన్ని చూసాడు .  వెంటనే "నమస్కారం బావగారూ" అన్నాడు .  కిట్టూ కోసం వెతుకుతూ దిక్కులు చూస్తున్న సూర్యం కిట్టూని చూడగానే, "అమ్మయ్య వచ్చేసావా! మొదటిసారి నువ్వొక్కడివే రైల్లో వస్తున్నావని నీ అక్క తెగ కంగారు పెట్టేసింది . ప్రయాణం బాగా జరిగిందా? తిండి సరిగా తిన్నావా?" అన్నాడు .  తలాడించాడు కిట్టూ  "పద మనిల్లు స్టేషన్ దగ్గిరే . హాయిగా కబుర్లు చెప్...

ఓ తమ్ముడి కథ

ఓ తమ్ముడి కథ నేను తెలుగులో ఇక్కడ తిరగావ్రాస్తున్నా చాలా సమయం తీసుకోవటం వలన ముందుగా ప్రచురించబడిన కథ నకలు  ని ఇక్కడ ఉంచున్తున్నాను. కథ చదివి మీ అభిప్రాయాలు చెప్పండి . రాజ మోహన్  ఇవటూరి

నా కథలు

నా కథలు ఇప్పటి వరకు ప్రచురితమైనవి ఇక్కడ పదిలపరుచుకున్దామని ప్రయత్నిస్తున్నాను .మీ అందరి ఆశీర్వాదంతో నేను ఇంకా మరిన్ని మంచి కథలు వ్రాయగలుగుతానని  అశిస్తున్నాను. మన సాహిత్యం గురించి చర్చించుకోవటం, మంచి విషయాలు పంచుకోవటం ముఖ్యోద్దేస్యాలు.  నా మొట్టమొదటి కధ "జీ ఎస్ రావూ సామజిక స్పృహ" . కాని ప్రచురణ కి అంగీకారం మాత్రం "ఓ తమ్ముడి కధ" కి ముందుగా వచ్చింది. ఈ రెండు కథలు రచనలో ప్రచురించారు . రెండు కథలు నేను సాహితి వైద్యం కి పంపిస్తే వసుంధర గారు ఎటువంటి సవరణ లేకుండా ప్రచురణకి పంపించారు . అది నాకు కొంత పొగరు పెంచినదనుకోండి . అయినా అన్ని కథలో నేను వారికే పంపి వారి అక్షింతలతోనే రచన లో నా కథలు చూసుకున్నాను . అంద ప్రభ కి అటువంటి అవకాశాలు లేవు కనుక మాములుగానే పంపాను .  మొదటి కధ నేను కలం పేరుతో వ్రాయాలని అనుకున్నాను (నాన్న జ్యేష్ట పేరుతో వ్రాసారు కనుక నేను కూడా అలాగే వ్రాయాలనుకున్నాను ), అందుకని మిస్టర్ క్లీన్ అనే కలం పేరుతోపంపించాను . కాని సాయి గారు నేను కధని నాన్నకి అంకితం చేశాను కనుక నేను ఎవరో తెలుసుకున్నారు. ఇటువంటి కలం పేర్లు మంచివి కావని చెప్పారు. ఎందుకంటే...