"నమ్మకం మనందరికీ అవసరమైన అలవాటు" అన్నారు నాన్న. ఈమధ్యనే నాన్న మాతో కొంచెం మాట్లాడుతున్నారు. నేనూ తమ్ముడు శ్యామూ అందుకని ఎంతో ఉత్సాహపడిపోయినా అప్పుడప్పుడు నాన్న చెప్పే విషయాలు చాలా ఇబ్బందికరంగా ఉండేవి. మనుషులందరినీ మొదటే ఎలా నమ్మేస్తాం? నా ముఖం చూసి భావాలు అర్ధం చేసుకున్న నాన్న "మనుషులని నమ్మితే వచ్చే ఇబ్బందేమిటో చెప్పరా" అని అడిగారు. "వాళ్ళు మనకి పూర్తిగా తెలియనప్పుడు వాళ్ళు మోసగాళ్లు అయ్యే అవకాశం ఉంది" అన్నాను భయం గానే. "సరే! నమ్మకపోతే మానని ఎవరూ మోసం చెయ్యరా?" నేను ఒక క్షణం ఆలోచించి "అయినా మోసం చెయ్యచ్చు. కానీ అవకాశం కొంత మందికే" అన్నాను. "ఆ కొంత మంది ఎవరో తెలుసా?" "ఎలా తెలుస్తుంది?" "...." "మీ నంభావనీయతా శాస్త్రం ప్రకారం ఏ ప్రయత్నానికైనా ఫలితాలు రెండే జరిగే అవకాశం ఉన్నపుడు ఒక్కొక్క ఫలితానికి అవకాశం యాభై శాతం ఉంటుంది. అంటే నమ్మి మోసపోవటానికీ నమ్మకపోయినా మోసపోవటానికీ అవకాశాలు సమానం. అటువంటపుడు నమ్మితేనే మంచిది కదా! ఎవరినీ నమ్మకపోవటం ద్వారా మనం నిజాయితీ పరులని అవమానిస్తున్నాం. అయినా మోసపోతున్నా...
నా కథలు ఇప్పటి వరకు ప్రచురితమైనవి ఇక్కడ పదిలపరుచుకున్దామని ప్రయత్నిస్తున్నాను .మీ అందరి ఆశీర్వాదంతో నేను ఇంకా మరిన్ని మంచి కథలు వ్రాయగలుగుతానని అశిస్తున్నాను. మన సాహిత్యం గురించి చర్చించుకోవటం, మంచి విషయాలు పంచుకోవటం ముఖ్యోద్దేస్యాలు.