"నువ్వు లేకపోతే నేను బతకలేను రాణీ !" అన్నాడు రాజు . "నువ్వు ఉంటేనే బతుకంటూ ఉంది రాజ్!" అండ్ రాణి "ఐ లవ్ యు హనీ " "ఐ లవ్ యు జానీ" ఇద్దరూ ఒకరి కళ్ళల్లో ఒకరు విశాఖ బీచ్ లో వెన్నెల మెరుపులో చూసుకుంటూ ఉండిపోయారు . 'ఎవరది?' అని హుంకరించిన గొంతు వినిపించగానే కప్ప ని తొక్కినట్టు ఉలిక్కిపడ్డాడు రాజు . 'మిమ్మల్నే అడుగుతున్నాను . ఎవరు మీరు? ఇంత రాత్రి మీకేం పని?' అంటూ టార్చి లైటు ముఖాల మీదికి ఫోకస్ చేసాడు పోలీసు . పోలీసుకి ఏ మాత్రం కళా హృదయం ఉన్నా 'ఏం పని మీకు ' అని మాత్రం అడిగే వాడు కాదు . 'ఐ యాం రాజు ఎమ్మే . థిస్ ఈస్ రాణి ...."ప్రమాదం లో ఇంగ్లీష్ మాట్లాడితే పని జరుగుతుందనే నమ్మకం తో కొనసాగిన్తుండగా ... 'ఇంగిలీసాపవయ్యా " అన్నాడు పోలీసు . ఇంగ్లీష్ ఆపటంతో రాజు నోట మాట కూడా ఆగిపోయింది . రాజూ రాణీ ప్రేమించుకుంటున్నారనీ కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదనీ కనుకే రాత్రి పన్నెండు గంటలకి బీచ్ లో ఉన్నారనీ ఏ తల మాసిన వాడికైనా అర్థమవుతుంది . కానీ మాయటానికి త...
నా కథలు ఇప్పటి వరకు ప్రచురితమైనవి ఇక్కడ పదిలపరుచుకున్దామని ప్రయత్నిస్తున్నాను .మీ అందరి ఆశీర్వాదంతో నేను ఇంకా మరిన్ని మంచి కథలు వ్రాయగలుగుతానని అశిస్తున్నాను. మన సాహిత్యం గురించి చర్చించుకోవటం, మంచి విషయాలు పంచుకోవటం ముఖ్యోద్దేస్యాలు.