MAY 1994 - RACHANA TELUGU MAGAZINE " ఏం బాబూ నువ్వు దిగవలసినది కొవ్వురేనా? " ఆలోచనల్లో ఉన్న కిట్టూ జవాబివ్వలేదు . "ఏవయ్యోవ్ నిన్నే" - అతన్ని కదిపింది ముసలావిడ . అప్పుడు తెలివి తెచ్చుకుని ఏమిటన్నట్టు చూసాడు కిట్టూ . "నువ్వు కొవ్వూరులో దిగాలన్నావా లేదా? " "అవునండి" "మరి కొవ్వూర్లో రైలాగి ఇంతసేపయింది . ఎమాలోచిన్స్తున్నావ్ ?" "ఆ! కొవ్వురోచ్చేసిండా?" అంటూ గబగబా రైలు దిగాడు కిట్టూ . "ఇదిగో నీ సంచీ మరిచిపోయావు ." అని అందించిన్దావిడ కిటికీలోంచి . కిట్టూ సంచీ తీసుకుని ముందుకి నడవబోతూ రైలు పెట్టేలన్నింట్లో తొంగి చూస్తూ వస్తున్న సూర్యాన్ని చూసాడు . వెంటనే "నమస్కారం బావగారూ" అన్నాడు . కిట్టూ కోసం వెతుకుతూ దిక్కులు చూస్తున్న సూర్యం కిట్టూని చూడగానే, "అమ్మయ్య వచ్చేసావా! మొదటిసారి నువ్వొక్కడివే రైల్లో వస్తున్నావని నీ అక్క తెగ కంగారు పెట్టేసింది . ప్రయాణం బాగా జరిగిందా? తిండి సరిగా తిన్నావా?" అన్నాడు . తలాడించాడు కిట్టూ "పద మనిల్లు స్టేషన్ దగ్గిరే . హాయిగా కబుర్లు చెప్...
నా కథలు ఇప్పటి వరకు ప్రచురితమైనవి ఇక్కడ పదిలపరుచుకున్దామని ప్రయత్నిస్తున్నాను .మీ అందరి ఆశీర్వాదంతో నేను ఇంకా మరిన్ని మంచి కథలు వ్రాయగలుగుతానని అశిస్తున్నాను. మన సాహిత్యం గురించి చర్చించుకోవటం, మంచి విషయాలు పంచుకోవటం ముఖ్యోద్దేస్యాలు.